రైల్వేకోడూరు, సెప్టెంబర్ 16 (తొలి కిరణం): తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం జగడంపల్లెలో మంగళవారం నిర్వహించిన వినాయక స్వామి పూజా కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వైసీపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, పుల్లంపేట నాయకులు ముద్ద బాబుల్ రెడ్డి, రైల్వేకోడూరు నాయకుడు తోట శివసాయి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వినాయక స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు కోడూరు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచులు దార్ల చంద్రశేఖర్, ఆనాల చిన్నచంగల్ రెడ్డి, కంభంపాటి శ్రీనివాసరెడ్డి, ఆర్వీ రమణ, మైనారిటీ నాయకులు షఫీ, బత్తల సుబ్రహ్మణ్యం, బత్తల మణి, కౌరెడ్డి సిద్ధయ్య, బత్తిన ఆనంద్, మల్లు కృష్ణారెడ్డి, గౌతంరెడ్డి, రమణారెడ్డి తదితరులతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


