నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 16 (తొలి కిరణం): బీసీ కులగణన చేపట్టే వరకు బీజేపీని వదిలిపెట్టబోమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్‌చారి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ పొలిటికల్ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ కులగణన చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హామీ ఇచ్చారని, అయితే బీసీల లెక్కలు తీయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అరవింద్‌చారి ఆరోపించారు. బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయిలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, గతంలో రూపొందించిన ప్రశ్నావళిని రద్దు చేసి ఓబీసీ కాలమ్‌తో కూడిన ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు. గత 12 సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
బీసీలకు తగిన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, బత్తుల జితేందర్ గౌడ్, మహేందర్ నాయుడు, రాజు, శివ, మల్లేష్, సురేష్, కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

