నాగర్కర్నూల్, సెప్టెంబర్ 15 (తొలి కిరణం):
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి రమేష్ మంగళవారం సందర్శించి పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తోటపల్లి, యూపీఎస్ బెక్కర, వేపూరు వి.పి.ఎస్ పాఠశాలలను సందర్శించిన జిల్లా విద్యాధికారి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా స్థాయి, అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని తగిన సూచనలు చేశారు.
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో బోధన, విద్యార్థుల అభ్యసన స్థాయిపై నిరంతరం దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


