తొలి కిరణం | సెప్టెంబర్ 15 | ఘట్కేసర్
ఘట్కేసర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తూ ముందుకు సాగాలని నేతలు ఆకాంక్షించారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బాలగౌని వెంకటేష్ గౌడ్, మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవి యాదవ్ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


