తొలి కిరణం | ఘట్కేసర్ ప్రతినిధి
ఘట్కేసర్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
దాడుల్లో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, హాట్ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్ మిక్స్ పౌడర్, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి బేకరీ యజమాని షేక్ అక్బర్, సూపర్వైజర్ షేక్ నజీర్ బాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన సామగ్రితో పాటు ఇద్దరు నిందితులను తదుపరి చర్యల కోసం ఘట్కేసర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు చేపట్టే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


