తొలి కిరణం | సెప్టెంబర్ 15 | ఘట్కేసర్ ప్రతినిధి
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పరిధిలోని పోచారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత యూనిఫాంలు, బూట్లు, కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బద్దం మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బద్దం నరసింహారెడ్డి, పోచారం గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా బద్దం మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత అభినందనీయమన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. గురువులను గౌరవిస్తూ, పెద్దల పట్ల మర్యాదగా మెలగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, తిరుమల రెడ్డి, జోసెఫ్, మల్లేష్, నాగ చైతన్య, రవితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


