నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 40 మండలాలు, సుమారు 1,000 గ్రామాల మీదుగా బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతుందని యాత్ర నాయకుడు నరిగే నరేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 85 శాతం ఉన్న బహుజన వర్గాలు ఇప్పటికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు, భూమి వంటి మౌలిక హక్కులకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా పేదలకు కూడు, గుడ్డ, గూడు వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిస్థాయిలో అందడం లేదని విమర్శించారు.
విద్యార్థులు, యువత మేల్కొని ఉన్నత విద్యను అభ్యసించి చట్టసభల్లో తమ గొంతుకను వినిపించాలని నరిగే నరేందర్ పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బహుజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి పద్మ, రాములమ్మ, సరోజ, లక్ష్మమ్మ, నారమ్మ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


