శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణఠాణాలో కొలువుదీరిన గణనాథుడు
తెలంగాణతాజా కథనం

ఠాణాలో కొలువుదీరిన గణనాథుడు

ఠాణాలో కొలువుదీరిన గణనాథుడు
17 ఏళ్ల తర్వాత బిజినపల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక విగ్రహ ప్రతిష్ఠప్రత్యేక పూజలు చేసిన ఎస్‌ఐ షంషోద్దీన్.. మత సామరస్యానికి ప్రశంసలు
బోనాసి గణేష్
బోనాసి గణేష్
రిపోర్టర్
2026-09-16
4 నిమిషాల పఠనం
42 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
ఠాణాలో కొలువుదీరిన గణనాథుడు

ఠాణాలో కొలువుదీరిన గణనాథుడు

బిజినపల్లి, సెప్టెంబర్ 15:

బిజినపల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో గణనాథుడు కొలువుదీరాడు. సుమారు 17 సంవత్సరాల తర్వాత పోలీస్‌స్టేషన్ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్‌ఐ షంషోద్దీన్ స్వయంగా వినాయకుడికి పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముస్లిం మతానికి చెందిన ఎస్‌ఐ షంషోద్దీన్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడాన్ని వివిధ గ్రామాల నుంచి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రజలు అభినందించారు. మత సామరస్యానికి, సోదరభావానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ షంషోద్దీన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని మతాలకు చెందిన వారు పరస్పరం సోదరభావంతో కలిసి మెలిసి పండుగలను ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు.
పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఏఎస్సై కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుళ్లు సతీష్, శేఖర్‌గౌడ్, నారాయణ, జితేందర్ నాయక్, అంకిత, శివకుమార్, రమేష్, రాము తదితర పోలీసు సిబ్బందితో పాటు నాయకులు తిరుపతయ్య, మిద్దె రాము, గోవిందు నాయక్, వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#నాగర్ కర్నూల్#బిజినపల్లి పీస్

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి