నాగర్కర్నూల్ జిల్లా, కల్వకోల్: ఆది జాంబవ చైతన్య సమితి–కల్వకోల్ సంఘం ఆధ్వర్యంలో వివిధ మండలాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు సాధించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. నలవాల ఎల్లయ్య, నలవాల సుదర్శన్, నలవాల రాజు, కడ్తాల రామలక్ష్మిలను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా PRTU–TS హన్వాడ మండల అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కడ్తాల స్వామిని కూడా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు విద్యారంగంలో అందిస్తున్న సేవలను కొనియాడారు. సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల సేవలు ఎంతో అవసరమని అన్నారు.
ఆది జాంబవ చైతన్య సమితి అధ్యక్షుడు కడ్తాల బాలకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లోకేశ్, ముఖ్య నాయకులు యేసయ్య, అడ్వకేట్ నిరంజన్, అర్జున్, కృష్ణమూర్తి, రాంబాబు, బాలరాజు, రమేష్ కుమార్, రిపోర్టర్ పుల్లయ్య, వార్డు మెంబర్లు రాముడు, రమేష్, మద్దిలేటి, చింతపల్లి కుర్మయ్య, కుర్మన్న, ప్రకాశ్, రాముడు, విశ్వనాథం, ప్రేమ్ కుమార్, చంద్రయ్య, రాజా, కురుమూర్తి, కోళ్ల రాజు, బుడ్డయ్య, శివకుమార్, కార్తీక్, బి. బాలకృష్ణ, శ్రీను, డేవిడ్ రాజు, సంపత్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


