చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహారాజ్గూడ గ్రామంలో ఓ ఆసక్తికరమైన ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఇల్లు ఏకంగా రెండు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉండటం విశేషం.
ఇంట్లోని మొత్తం ఎనిమిది గదుల్లో నాలుగు గదులు తెలంగాణలో, మరో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉన్నాయి. అంతేకాదు.. ఇంటి కిచెన్ తెలంగాణలో ఉండగా, హాల్, బెడ్రూమ్లు మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయి.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఇంటి యజమాని తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలకూ ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఇల్లు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రెండు రాష్ట్రాల సరిహద్దు ఒకే ఇంటి మధ్య నుంచి వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉంటూనే రెండు రాష్ట్రాల్లో ఉండే అవకాశం కలగడం ఆసక్తికరంగా మారింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


