రైల్వే కోడూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ఉంగరాల నగర్లో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ప్రతిమను రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్, యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజల ఆహ్వానం మేరకు ఉంగరాల నగర్‌కు విచ్చేసిన నాయకులకు స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని మరింత పెంపొందించాలని, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


