శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణభార్యతో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య!
తెలంగాణతాజా కథనం

భార్యతో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య!

భార్యతో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య!
• గొంతు కోసి కరీంను హతమార్చిన గౌస్ పాషా• హత్యకు భార్య సలీమా బేగం సహకారం.. ఇద్దరి అరెస్ట్• వాట్సప్ కాల్స్‌తో కుట్ర.. పంచాయితీలోనే బెదిరించిన నిందితుడు
కొంకలి మధుసూదన్
కొంకలి మధుసూదన్
రిపోర్టర్
2026-09-13
4 నిమిషాల పఠనం
358 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
భార్యతో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య!

భార్యతో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో చోటుచేసుకున్న మహ్మద్ కరీం (43) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యతో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో గౌస్ పాషా కరీంను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు కరీం భార్య సలీమా బేగం సహకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ-1గా గౌస్ పాషా, ఏ-2గా సలీమా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కరీం భార్య సలీమా బేగం, గౌస్ పాషా మధ్య సుమారు రెండేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన కరీం భార్యను మందలించడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సుమారు రెండు నెలల క్రితం జరిగిన పంచాయితీలో పెద్దలు గౌస్ పాషాను కూడా మందలించారు. ఆ సమయంలో కరీంను చంపేస్తానని గౌస్ పాషా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
కరీంను హత్య చేయాలనే ఉద్దేశంతో గౌస్ పాషా రోడ్డు పక్కన కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నాడు. అనంతరం వాట్సప్ కాల్స్ ద్వారా కరీం హత్యకు సంబంధించి కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తి సలీమా పేరుపై ఉండటంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేసినట్లు తెలిపారు.
సలీమా బేగం నెల్లూరు దర్గాకు వెళ్లిన సమయంలో హత్యకు పథకం అమలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గౌస్ పాషా కరీం ఇంటికి వెళ్లి డోర్‌బెల్ కొట్టాడు. నిద్రమత్తులో ఉన్న కరీం తలుపు తీయగానే కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అక్కడి నుంచి పరారైన గౌస్ పాషా మార్గమధ్యంలో కత్తి, చెప్పులు, బట్టలు, గ్లాసులను పడేసినట్లు పోలీసులు తెలిపారు.
కరీం హత్య అనంతరం సలీమా బేగంను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా హత్య కుట్రకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సలీమా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గౌస్ పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కరీంను తానే హత్య చేసినట్లు గౌస్ పాషా అంగీకరించినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ వెంకట్ రెడ్డితో పాటు ఐడీ పార్టీ సిబ్బంది వెంకటేష్, భీముడు, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#నాగర్ కర్నూల్

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి