ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఓబులవారిపల్లి, సెప్టెంబర్ 12: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్న వరంపాడు క్రాస్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘కల్పిత నాయకుడు అంబేద్కర్’ పేరుతో పుస్తకాన్ని రచించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించకుండా రద్దు చేయాలని, పుస్తక రచయిత అమర ప్రసాద్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్‌వాది, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బి.ఆర్. రమణ మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కులమతాలకు అతీతంగా దేశ పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం చేయడం వల్ల భావితరాల్లో అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.
అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు, రచనలు చేయడాన్ని ప్రారంభంలోనే అడ్డుకోవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్‌వాదులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పుస్తక రచయిత అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు స్పందించకపోవడం బాధాకరమని నాయకులు విమర్శించారు. అంబేద్కర్ కీర్తిని దిగజార్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌వాదులు పోలమనేని మల్లికార్జున, పాణ్యం చిన్నయ్య, గొంజిపల్లి హరి, డేగల మహేశ్వర నారాయణ, గాజుల శ్రీనివాసులు, పోలంనేని చంద్రయ్య, అంబారి శ్రీనివాసులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


