రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని 1వ సచివాలయంలో కొత్తగా విడుదలైన పెన్షన్‌దారుల కోసం రెండో శనివారం సెలవు అయినప్పటికీ సచివాలయం సిబ్బంది విధులకు హాజరై సేవలు అందిస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది బృందం పెన్షన్‌దారులకు అవసరమైన సేవలను అందిస్తూ కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హేమంత్ కుమార్, అంకిపల్లి మధు, షేక్ గౌస్ సచివాలయం సిబ్బందిని కలిసి వారి సేవలను అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సెలవు రోజున కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవాభావాన్ని వారు ప్రశంసించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


