నాగర్కర్నూల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నాగర్కర్నూల్ నోడల్ అధికారి శ్రీ వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ స్వామి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా నోడల్ అధికారి వెంకటరమణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలు, ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు వి. మదన్మోహన్ రెడ్డి, గౌస్ మొయిద్దీన్, బండి నరసింహ, గుంటి గోపి, జానయ్య, పద్మజ, వినోద్, విష్ణు, ప్రవీణ్, రామ్మోహన్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభి : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నాగర్కర్నూల్నం దించారు. తమ సందేశాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు.
విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ శ్రీ స్వామి స్వాగతం పలికారు.
కళాశాల అభివృద్ధికి చేదోడువాదోడుగా ఉంటూ సహకరిస్తున్న గ్రామ సర్పంచ్ రామకృష్ణను, మాజీ ప్రిన్సిపాల్ రాముడిని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అభినందించింది. వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు, అధ్యాపకుల ఉత్సాహంతో సందడిగా సాగాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


