పాలెం: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు.
కొత్త రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గోవిందు శేఖర్, సయ్యద్ గీజర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


