తెలకపల్లి: మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను మల్లికార్జున రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు, స్థానిక ప్రజలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దొరల అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఐలమ్మ ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలకపల్లి సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, రజక సంఘం గౌరవ అధ్యక్షుడు బక్కయ్య, అధ్యక్షుడు శ్రీను, ప్రచార కార్యదర్శి పవన్‌కుమార్, లింగస్వామి, సత్యనారాయణ, అబ్బాస్, మెట్రో శివ, నడిపయ్య, మధు, పసుపల విజయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, ఎత్తపు రవి, బొపెల్లి నిరంజన్, అనిల్‌కుమార్, మల్లేష్, కొమ్ము ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

