రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోని రంగనాయకులపేటలో నివాసం ఉంటున్న పసుపులేటి ఉమా మహేష్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో వారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కేకే చౌదరి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోతురాజు నవీన్, నార్జాల హేమరాజ్, మల్లెం హేమంత్ కుమార్, పోతురాజు సుమంత్, గోవిందు శివ, మని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


