రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా రాఘవరాజపురానికి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు, ఏఐటీయూసీ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర–పైనం విష్ణు శివజ్యోతి దంపతుల కుమార్తె దాసరి వర్ష ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
దాసరి వర్ష విద్యలో ప్రతిభ కనబరుస్తూ పదో తరగతిలో 600 మార్కులకు 591 మార్కులు, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 985 మార్కులు సాధించింది. అనంతరం NEET–2026లో 452 మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1,62,981 సాధించి, ఫేజ్–1 కౌన్సెలింగ్‌లో సెప్టెంబర్ 2, 2026న కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పరిధిలో MBBS సీటు పొందింది.
ఈ సందర్భంగా దాసరి జయచంద్ర మాట్లాడుతూ, “నేను కార్మికుల జీతభత్యాలు, వారి హక్కుల కోసం రోడ్లపై పోరాటం చేస్తుంటే.. నా కుమార్తె డా. దాసరి వర్ష దేశ భవిష్యత్తు అయిన ప్రజల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా పేద ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యురాలిగా సేవ చేయడానికి సిద్ధమైంది. ఇది మా కుటుంబానికి మాత్రమే కాదు.. యావత్ కార్మిక వర్గానికి గర్వకారణం” అని అన్నారు.
తన కుమార్తె విజయానికి సహకరించిన విద్యాసంస్థల ఉపాధ్యాయులు, యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కోడూరులోని విజ్డమ్ హై స్కూల్/సీబీఎస్ఈ ఉపాధ్యాయులు, యాజమాన్యం, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ విద్యను అందించిన అశ్వమేధ కళాశాల, తిరుపతి అధ్యాపక బృందం, యాజమాన్యానికి కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
“గురువుల రుణం తీర్చుకోలేనిది. వారి క్రమశిక్షణ, ప్రోత్సాహమే ఈ రోజు నా బిడ్డను డాక్టర్‌గా తీర్చిదిద్దింది” అని దాసరి జయచంద్ర పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


