తెలకపల్లి మండలం, లక్నారం: మద్యం మత్తులో ఇంట్లో పడిపోయిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన లక్నారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్నారం గ్రామానికి చెందిన మన్నేం ఎల్లస్వామి (30), బాల చంద్రయ్య కుమారుడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
ఎల్లస్వామి బల్మూరు గ్రామానికి చెందిన తాండ్ర కృష్ణవేణి (35)తో వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తూ హైదరాబాద్లో కూలీ పనులు చేసుకునేవారు. గత కొద్ది రోజులుగా ఎల్లస్వామి మద్యానికి బానిసై పనులకు వెళ్లకుండా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు పది రోజుల క్రితం కృష్ణవేణితో కలిసి స్వగ్రామమైన లక్నారానికి వచ్చాడు.
బుధవారం సాయంత్రం నుంచి మద్యం సేవిస్తూ గ్రామంలో తిరిగిన ఎల్లస్వామి రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఇంట్లో బోర్లా పడిపోయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడి అక్క పానుగంటి చిన్నమ్మ భర్త ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
– ఎం. రమేష్, ఎస్సై, తెలకపల్లి
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

