గోపాలపేట: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ విద్యార్థి, యువజన నాయకులు వెళ్తారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. గోపాలపేటలో బీఆర్ఎస్ విద్యార్థి, యువజన నాయకులను ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా సస్పెన్షన్లకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యార్థులు తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా, వారు నిరసనలకు వెళ్లకముందే ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థుల గొంతుకను అణచలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


