పాలెం: శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, పాలెం నూతన అదనపు కార్యనిర్వహణాధికారిగా శ్రీ జన్నుంపల్లి జైపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యనిర్వహణాధికారి (గ్రేడ్–III)గా ఆయన అదనపు బాధ్యతలను స్వీకరించారు.
ప్రస్తుతం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, పోతులమడుగు నందు రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి, తాజాగా పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఆలయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేలా తన సేవలను కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన జైపాల్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయన సేవలు మరింత విజయవంతంగా కొనసాగాలని భక్తులు ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


