కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కల్వకుర్తి మండలం తర్నికల్ తండా గ్రామ శివార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. తర్నికల్ తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్ అక్రమంగా మద్యం విక్రయించేందుకు తరలిస్తుండగా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, మద్యం రవాణాకు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను సీజ్ చేశారు.
పట్టుబడిన వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు.
ఈ దాడిలో వాసురామ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, కె. శ్రీనివాస్, అనూష పాల్గొన్నారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

