కొల్లాపూర్: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఐహెచ్ఆర్ఓ) ఆధ్వర్యంలో కొల్లాపూర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులకు క్రీడా సామాగ్రిని స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర బాడీ సభ్యులు, జిల్లా ఇన్చార్జి ఆవంచ సాల్వాచారి ఆదేశాల మేరకు నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మంగి ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఐహెచ్ఆర్ఓ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడా రంగంలోనూ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విద్యా, క్రీడా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను సాకారం చేసేలా కష్టపడి చదువుతూ తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థినులకు అవసరమైన క్రీడా పరికరాలను అందజేయడంతో వారిలో ఉత్సాహం నెలకొంది. అనంతరం కళాకారుల ఆటపాటలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఐహెచ్ఆర్ఓ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్ఓ నాగర్కర్నూల్ జిల్లా కమిటీ సభ్యులు, కార్యదర్శి బోనాసి రాజు, యాదగిరి, నాగరాజు, డప్పు నరసింహ, సుధాకర్ ఆచారి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

