తెల్కపల్లి: గణేష్ నవరాత్రుల వేడుకలను శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించేందుకు తెల్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్ఐ ఎం. రమేష్తో పాటు పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటు, విగ్రహాల ఊరేగింపులు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత తదితర అంశాలపై చర్చించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సూచించారు.
ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిస్తూ సోదరభావం, సామరస్యంతో పండుగను నిర్వహించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతి, సామరస్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమావేశంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పోలీసు అధికారులతో పంచుకున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

