రైల్వేకోడూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా రైల్వేకోడూరు నియోజకవర్గం రాఘవరాజుపురంలోని టీడీపీ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్యాయాన్ని ఎదురించి న్యాయం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా 53 కొవ్వొత్తులను వెలిగించారు. సత్యం, న్యాయం, ప్రజాస్వామ్య విలువల పట్ల టీడీపీ శ్రేణుల అచంచల విశ్వాసానికి ఈ కొవ్వొత్తులు ప్రతిబింబంగా నిలిచాయని నాయకులు పేర్కొన్నారు.
అక్రమ నిర్బంధం నుంచి ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని, న్యాయంపై నమ్మకంతో సాగిన పోరాటంలో చివరికి నిజం గెలిచిందనే నమ్మకానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని చంద్రబాబు నాయుడికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


