శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్ఆంధ్రప్రదేశ్బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై అవగాహన
ఆంధ్రప్రదేశ్తాజా కథనం

బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై అవగాహన

బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై అవగాహన
తిరుపతి జిల్లా ఉద్యాన శాఖ అధికారి జయభారత్ రెడ్డి
KALI CHINNAIAH
KALI CHINNAIAH
రిపోర్టర్
2026-09-09
4 నిమిషాల పఠనం
13 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై అవగాహన

బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై అవగాహన

రైల్వేకోడూరు రూరల్: బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైల్వేకోడూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఉద్యాన శాఖ అధికారి జయభారత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బొప్పాయి విత్తన డీలర్లు, నర్సరీ యజమానులు, బొప్పాయి రైతులు నర్సరీ యాక్ట్–2010 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని సూచించారు. నర్సరీ యజమానులు విత్తన నిల్వల వివరాలు, విత్తన మొలక శాతం, మొక్కల విక్రయ రిజిస్టర్ తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రైతులకు విక్రయించే మొక్కలకు తప్పనిసరిగా బిల్లులు అందించాలని ఆదేశించారు.
కోడూరు ఉద్యాన శాఖ అధికారి వెంకట భాస్కర్ మాట్లాడుతూ ప్రతి నర్సరీ కార్యకలాపాలను సంబంధిత వీఏఎల్‌ఏల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన నాటే మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరాజుపేట ఉద్యాన కళాశాల శాస్త్రవేత్త చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నర్సరీల్లో వైరస్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కీటక నిరోధక వలలను వినియోగించాలని సూచించారు.
కోడూరు వ్యవసాయ అధికారి సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో బొప్పాయి విత్తనాలకు ఎలాంటి కొరత ఉండదని తెలిపారు. విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీలర్లు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విక్రయ వివరాలను విత్తన రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, నర్సరీ యజమానులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#ఆంధ్ర ప్రదేశ్#రాష్ట్రం

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి