వనపర్తి: వనపర్తి ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ ఎస్. నరేందర్ రెడ్డి, వనపర్తి జిల్లా ఎంఎల్ఎస్ పాయింట్ గోదాం ఇన్చార్జ్ మహేష్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
హాస్టల్లో స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. గత నెలలో సుమారు 15 క్వింటాళ్ల బియ్యం విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లాలో విద్యార్థులకు అందాల్సిన సరుకుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని BC పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్, PDSU రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్, బంజారా విద్యార్థి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల సంక్షేమానికి కేటాయించిన నిధులు, సరుకుల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


