నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 8: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఫిజియోథెరపీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
నాగర్ కర్నూల్ పాత కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఫిజియోథెరపీ ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణలో దాని పాత్రపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. పారామెడికల్ కళాశాల విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం కేక్ కట్ చేసి ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.ఎన్. సుమంత్, కార్యదర్శి డాక్టర్ ఎన్. సృజన, కోశాధికారి డాక్టర్ అంజలి, డాక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


