బిజినేపల్లి, సెప్టెంబర్ 6: మార్షల్ ఆర్ట్స్ (తైక్వాండో)లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌కు బాల్య మిత్రులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన 1987–88 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
గ్రామానికి గర్వకారణం.. ఆణిముత్యం
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన తెప్ప శ్రీనివాస్ చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకుని నిరంతర సాధనతో అనేక విజయాలు సాధించారని కొనియాడారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం తమ పూర్వ విద్యార్థి, బాల్య మిత్రుడిగా తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాల్లో ముందంజ
తెప్ప శ్రీనివాస్ కేవలం క్రీడా రంగంలోనే కాకుండా సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని మిత్రులు గుర్తు చేశారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో సేవా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ద్వారా అనేక ప్రాంతాల్లో నిరుపేదలకు భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వృద్ధులకు వస్త్రాలు, ఇతర సహాయాలను అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని అన్నారు.
నిరుపేదల కోసమే నా జీవితం: తెప్ప శ్రీనివాస్
ఈ సందర్భంగా లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నిరుపేదల కోసమే నా జీవితం అంకితం” అని అన్నారు. తన బాల్య మిత్రులు, పూర్వ విద్యార్థులు తన విజయాలను గుర్తించి ఆత్మీయంగా సన్మానించడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన బాల్య మిత్రులు, గ్రామ పెద్దలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, సుల్తాన్, కాశన్న, బాలరాజ్, శ్రీనివాస్, వినోద్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి, నాగన్‌గౌడ్, పద్మారావు, కురుమయ్య, చంద్రకళ, పద్మ, శోభ, సుధామణి, లక్ష్మీ, భాగ్య, జమీరా బేగం, పాలెం గ్రామ ప్రజలు, పెద్దలు, స్టార్ నేతాజీ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


