తొలి కిరణం, సెప్టెంబర్ 6 ప్రతినిధి, తిరుపతి జిల్లా: చిట్వేల్ మండల పరిధిలోని ఎన్.ఉప్పరపల్లె హరిజనవాడ గ్రామంలో శ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి విశ్వనాథం నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఉమ్మయ స్వామి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ముఖ్య అతిథులు కస్తూరి విశ్వనాథం నాయుడు, మాచినేని విశ్వేశ్వర్ నాయుడులను గ్రామ ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రారంభోత్సవం గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కోదండ రామస్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కట్ట గుండయ్య, కొండ వెంకటేష్, కట్టా లోకేష్, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి బొంగుటవుల రాజశేఖర్ నాయుడు, రైల్వేకోడూరు నియోజకవర్గ ఆర్టీఎస్ కోఆర్డినేటర్ తుంగ నవీన్ కుమార్ నాయుడు, కస్తూరి శివ తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


