అవాంఛ సాల్వ చారి, తొలి కిరణం ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలకపల్లి మండల కేంద్రంలోని శాంతినికేతన్ విద్యాలయం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
శ్రీకృష్ణ జన్మాష్టమి సంప్రదాయంలో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాలతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు విద్యార్థులకు సత్యం, ధర్మం, కర్తవ్యనిష్ఠ, మానవతా విలువలను తెలియజేస్తాయని పేర్కొన్నారు. విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

