హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి వర్గం నుండి కొండా సురేఖను తొలగించిన అనంతరం ఆమె కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే తన తల్లిపై నేరుగా పోటీ చేసి గెలవాలని ఆమె బహిరంగ సవాల్ విసిరారు.

మీడియాతో మాట్లాడిన కొండా సుష్మిత, తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను సాకుగా చూపిస్తూ తన తల్లిపై మంత్రివర్గం నుండి తొలగింపు చర్యలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదని మండిపడ్డారు. తానేనాడూ కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం రేవంత్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలపై మాత్రమే మాట్లాడానని ఆమె స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీల అమలును వదిలేసి, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రిపై సుష్మిత ధ్వజమెత్తారు. జీవితాంతం ప్రజల కోసం కష్టపడిన తన తల్లి కొండా సురేఖను ఈరోజు ఇలాంటి పరిస్థితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా తాను మనస్ఫూర్తిగా శపిస్తున్నానని సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి రాజకీయంగా తాను ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):