అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


