హైదరాబాద్, సెప్టెంబర్ 4:
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి చేసిన సిఫార్సుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ లోక్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పరిణామాలపై కొండా సురేఖ స్పందిస్తూ.. “బర్తరఫ్ నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె స్వతంత్ర మహిళ. ఆమె వ్యవహారాలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? నా కుమార్తె వ్యవహారాలను నేను ఖండించాల్సిన అవసరం లేదు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుబట్టే అధికారం నాకు లేదు” అని పేర్కొన్నారు.
అలాగే, తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదని అన్నారు.
“కాంగ్రెస్ అధిష్టానానికి నేను ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తాను. జగ్గా రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నాను” అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇదే సమయంలో తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


