నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామానికి చెందిన శ్రీ వేముల నిరంజన్ గారు ZPHS అంబటిపల్లి పాఠశాలలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నిరంజన్ గారు.. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా కృషి చేయడంతో పాటు, విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించేలా కృషి చేశారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల ప్రగతి, హాజరు శాతం పెంపు, డ్రాపౌట్ల నివారణ వంటి అంశాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక చేయడం పట్ల మంగనూర్ గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగనూర్ గ్రామానికి, బిజినపల్లి మండలానికి గర్వకారణంగా నిలిచిన వేముల నిరంజన్ గారికి పలువురు అభినందనలు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


