అల్వాల్, సెప్టెంబర్ 2: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వెంకటాపురం డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిడమనూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి నందికంటి శ్రీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారీ ర్యాలీతో సందడి
జన్మదిన వేడుకల సందర్భంగా ఇందిరానగర్ లేబర్ అడ్డా నుంచి వెంకటాపురం పీజేఆర్ కూడలి వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నందికంటి శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నందికంటి శ్రీధర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
ఘనంగా అన్నదానం
జన్మదిన వేడుకల అనంతరం ప్రజల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా కొనసాగాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


