తిమ్మాజీపేట: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి క్రీడా పోటీలను నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. మొత్తం 14 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


