పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెన్షనర్ల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధ్యాపకుల ఆధ్వర్యంలో అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి, బండి నరసింహ తదితర అధ్యాపకులు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే పీఆర్సీని విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చులకనగా మాట్లాడకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


