శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణఅన్నగా అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ
తెలంగాణతాజా కథనం

అన్నగా అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ

అన్నగా అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ
లక్నారం గ్రామ సర్పంచ్ దుల్లా సువర్ణ బాలు ఆత్మీయ కలయికరాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన సర్పంచ్
ఆవంచ సాల్వచారి
రిపోర్టర్
2026-08-31
4 నిమిషాల పఠనం
392 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
అన్నగా అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ

అన్నగా అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ

నాగర్ కర్నూల్, ఆగస్టు 31: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని లక్నారం గ్రామ సర్పంచ్ దుల్లా సువర్ణ బాలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు రాఖీ కట్టి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధం, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని సువర్ణ బాలు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో తమకు అన్నగా అండగా నిలుస్తున్న మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ కట్టి, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదరభావానికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో ప్రేమ, ఆప్యాయతలు, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. లక్నారం గ్రామ సర్పంచ్ దుల్లా సువర్ణ బాలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆత్మీయ కలయిక పలువురిని ఆకట్టుకుంది. ప్రజా జీవితంలో పరస్పర గౌరవం, ఆత్మీయత, సోదరభావంతో కూడిన సంబంధాలు మరింత బలపడాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి