తిమ్మాజిపేట: మండలంలోని బుద్ధ సముద్రం గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయ విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దేవాలయ విగ్రహాల పునఃప్రతిష్ఠతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో పాటు గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల రామాంజనేయులు, ఉపసర్పంచ్ అరుణ, మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, మల్లయ్య గౌడ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



