మేడ్చల్–మల్కాజ్గిరి, ఆగస్టు 30:
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో జన సమితి నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
నూతన జిల్లా కమిటీకి అధ్యక్షుడిగా లక్ష్మణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల దయాకర్, ఉపాధ్యక్షుడిగా రెడ్డిపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా సుమంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మణ్ రాజు ముదిరాజ్, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్ ఆర్య దయాకర్ గౌడ్లను ఎన్నుకున్నారు.
అలాగే కమిటీ సభ్యులుగా నరసింహులు, రవికుమార్‌లను నియమించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ అభినందనలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జిల్లాలో జన సమితి కార్యకలాపాలను విస్తృతం చేయాలని సూచించారు.
నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, ఎర్ర వీరన్న, రాష్ట్ర నాయకులు సర్దార్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



