మల్కాజ్గిరి, ఆగస్టు 30:
సమాజంలో సమానత్వం, మానవత్వం, సోదరభావాన్ని పెంపొందించేందుకు శ్రీ నారాయణ గురుదేవులు చేసిన కృషి చిరస్మరణీయమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ సమాజంలో వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడ గ్రీన్ఫీల్డ్స్లో శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 172వ శ్రీ నారాయణ గురుదేవ జయంతి, ఓణం వేడుకలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ నారాయణ గురుదేవుల చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులతో పాటు కేరళ సోదర సోదరీమణులకు ఓణం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నారాయణ గురుదేవులు “ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు – మానవునికి” అనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందిస్తూ సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని అన్నారు. శ్రీ నారాయణ గురుదేవులు చూపిన మార్గాన్ని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా కేరళ ప్రజలు అత్యంత పవిత్రంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఓణం పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వం, సంతోషానికి ప్రతీక అని ఎమ్మెల్యే తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పరస్పర స్నేహభావంతో, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఓణం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోకులం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గోకులం గోపాలన్, శ్రీ నారాయణ విద్యా సంస్థల అధ్యక్షులు పి.బి. రాఘవేంద్ర నందన్, ప్రధాన కార్యదర్శి పద్మనాభన్, కల్చరల్ సెక్రటరీ హరిదాస్, అలెక్స్, రాఘవాచారి, కే.ఆర్. మనోజ్, సెంథిల్ కుమార్, వీరారెడ్డి, ఉదయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, జమీందార్, సంపత్, సోమయ్య, రాము, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




