మేడ్చల్–మల్కాజిగిరి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కుమార్తె డా. సరిత నూతనంగా ఏర్పాటు చేసిన The Skin Atelier క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి హాజరై క్లినిక్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు డా. సరితకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిరా, నిజాంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటపాటి మురళి, బండారి లేఔట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరగాని వాసు, టేకుల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


