బోయిన్పల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బోయిన్పల్లి పరిధిలోని సెవెన్ టెంపుల్స్, సీతారామపురం, పెద్ద తోకట్ట, బాపూజీ నగర్, పెన్షన్ లైన్ ప్రాంతాల్లో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సులభంగా, సమర్థవంతంగా చేరేలా స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎస్ఓ శ్రీనివాస్, ఏఎస్ఓ కృష్ణవేణి, ఇన్స్పెక్టర్ కిరణ్మయి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


