రైల్వేకోడూరు, ఆగస్టు 29: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది రైల్వేకోడూరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా.. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.
స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో జన్మదిన వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త, తాతంశెట్టి తులసి స్థానిక మండల నాయకులతో కలిసి ఆహ్వాన సంచికను ఆవిష్కరించారు.
అనంతరం మండలంలోని ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలను పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు సాదరంగా ఆహ్వానించాలని నాయకులు కోరారు. రైల్వేకోడూరులో ఈ ఏడాది జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించి, పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కటికం నాగేంద్ర, గబ్బి వెంకటసుబ్బయ్య, రాగిపాటి విజయ్, గుణిపాటి వేణు, గంటా రాజా, లావులూరి చరణ్, లావులూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


