నాగర్‌కర్నూల్, ఆగస్టు 29: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గొర్రెల కాపరిపై దాడి చేయడంతో పాటు రెండు గొర్రెలను చంపిన ఘటన కలకలం రేపింది. గొర్రెల మేత కోసం వెళ్లిన పాశం నాగయ్య యాదవ్‌పై కొత్త రమేష్ రావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు.
తనకు సంబంధం లేని ప్లాట్‌లో గొర్రెలు మేస్తున్నాయనే నెపంతో రమేష్ రావు దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండు మూగజీవాలైన గొర్రెలను కూడా చంపినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై యాదవ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గొర్రెల కాపరిపై, మూగజీవాలపై దాడికి పాల్పడిన కొత్త రమేష్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు యాదవ సంఘం నాయకులు నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, ఎస్సై వెంకట్ రెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితుడు నాగయ్య యాదవ్‌కు న్యాయం చేయాలని కోరారు.
వినతిపై స్పందించిన డీఎస్పీ బుర్రి శ్రీనివాస్.. ఘటనపై విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితుడు నాగయ్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్‌తో పాటు జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


