నాగర్కర్నూల్, ఆగస్టు 29: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాగర్కర్నూల్ జిల్లా మూడో మహాసభలు ఈ నెల 27న పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ఏఐవైఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలనరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహాసభ అనంతరం ఏఐవైఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దేశామోని ఆంజనేయులు, కార్యదర్శిగా అల్వాల మధుగౌడ్ ఎన్నికయ్యారు. కార్యనిర్వహణ కార్యదర్శిగా కేసుముల్లా శివకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా వాడల బాలపిరు, సహాయ కార్యదర్శులుగా ధర్మరాజు, శివుడు ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది కౌన్సిల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. యువతకు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య విధానాలకు వ్యతిరేకంగా యువతను సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత హక్కుల పరిరక్షణ కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్లో మరిన్ని పోరాటాలు చేపడతామని నూతన కమిటీ నాయకులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

