జడ్చర్ల, ఆగస్టు 29: జడ్చర్లలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గురుకుల్ నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను వీక్షించి, గురుకుల్లో విద్యతో పాటు విద్యార్థులకు ఆధ్యాత్మిక, నైతిక విలువలను అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
గురుకుల్లో మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కా రాజ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవిందు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా గురుకుల్ నిర్వాహకులు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




