తెలకపల్లి, ఆగస్టు 29:
తెలకపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం సాంఘిక శాస్త్ర కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 6వ తరగతి మెటీరియల్ను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అలాగే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనను కొనసాగిస్తూ, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సాంఘిక శాస్త్ర జిల్లా అధ్యక్షుడు జే. కృష్ణమోహన్, ఆర్పీలు కృష్ణయ్య గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



